అంబేడ్కర్‌పై అనుచిత పుస్తక రచన
తహశీల్దార్, ఎస్సైకి అంబేడ్కర్ యువజన సంఘం వినతి
‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని విడుదల చేయడం సరికాదు
హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్(Dr. BR Ambedkar)పై హమారా ప్రసాద్ రాసిన ‘కల్పిత నాయకుడు’ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అంబేడ్కర్ యువజన సంఘం(Ambedkar Youth Association) నాయకులు నాగిరెడ్డిపేట మండలంలోనీ తహశీల్దార్ బిక్షపతికి, ఎస్సై భార్గవ్ గౌడ్‌కు వినతిపత్రం మంగళవారం అందజేశారు. ఈ నెల 18న సదరు పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు హమారా ప్రసాద్ ప్రకటించడం అభ్యంతరకరమని సంఘం నాయకులు పేర్కొన్నారు. అంబేడ్కర్‌ను కించపరిచేలా లేదా ఆయన వ్యక్తిత్వాన్ని తప్పుగా చిత్రీకరించేలా పుస్తకంలో అంశాలు ఉంటే వాటిపై చట్టపరంగా విచారణ జరిపించాలని కోరారు.
ఈ సందర్భంగా అంబేడ్కర్ సంఘం మండల అధ్యక్షుడు మిద్దె బాబురావు మాట్లాడుతూ... రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశ ప్రజలకు సమానత్వం,సామాజిక న్యాయం,హక్కుల కోసం పోరాడిన మహనీయుడని అన్నారు.అలాంటి మహానేతపై ‘కల్పిత నాయకుడు’ అనే పేరుతో పుస్తకం రాసి విడుదల చేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్యగా భావిస్తున్నామని తెలిపారు.పుస్తకంలోని విషయాలను పరిశీలించి,అభ్యంతరకర అంశాలు ఉంటే హమారా ప్రసాద్‌పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.