17 March, 2026 | 5:03 AM

జానంపేటలో చలివేంద్రం ప్రారంభోత్సవం

17-03-2026 01:17 AM

శ్రీరంగాపురం మార్చి 16:శ్రీరంగాపురం మండలం జానంపేట గ్రామంలో సోమవారం చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్ర మం నిర్వహించారు. గ్రామానికి వచ్చే ప్ర యాణికులు, స్థానిక ప్రజలకు వేసవి కాలం లో చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో చాపల మారుతి కుమార్ ఆధ్వ ర్యంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాముడు, ఉప సర్పంచ్ నాగరాజు కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.

గ్రామస్తులకు ఉపయోగపడే విధంగా వేసవి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ప్రజలకు దా హార్తి తీర్చే మంచి సేవ చేస్తున్న చాపల మారుతి కుమార్ను గ్రామ పెద్దలు అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, యువకులు పాల్గొన్నారు.