20 August, 2026 | 10:00 PM

Breaking News

చేగుంట-మెదక్ మార్గంలో రాకపోకల దారిమళ్లింపు: డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్   •   పెద్దతండాలో ఘనంగా తీజ్‌ ఉత్సవాలు   •   అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష   •   సింగరేణి పెట్రోల్ బంక్ పునరుద్ధరించాలి   •   మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో మంథని అభివృద్ధికి మరింత ప్రాధాన్యం   •   చిట్యాలలో రిపోర్టర్‌పై దాడి కేసు.. నలుగురు నిందితుల అరెస్ట్   •   చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   రూ.9 కోట్లతో డబుల్‌ రోడ్డుకు శంకుస్థాపన   •   పాపన్నపేట కాంగ్రెస్‌ పార్టీకి కొత్త సారథ్యం   •   పేదోళ్లకు సన్న బియ్యం ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిదే   •  

జిల్లాకే మల్లుపేట్ గ్రామం ఆదర్శం

20-08-2026 08:52 PM

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

సదాశివనగర్,(విజయక్రాంతి): జిల్లాలోనే మొట్ట మొదటిగా మహిళా సమైక్య భవనం నిర్మించి జిల్లాకే ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే మదన్మోహనరావు అన్నారు. గురువారం గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.గ్రామంలో రూ.50లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు.మహిళా సమాఖ్య భవనం, సీసీ రోడ్డు, గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు మహిళా సమాఖ్య భవనం మరింత ఉపయోగకరంగా మారనుండగా, నూతన గ్రామపంచాయతీ భవనం ద్వారా గ్రామ పరిపాలనా సేవలు ప్రజలకు మరింతసౌకర్యవంతంగా ఉంటుందన్నారు.

గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే మదన్ మోహన్  ఈ సందర్భంగా పేర్కొన్నారు. మల్లుపేట్ గ్రామంలో రూ.50 లక్షల అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చెర్మన్ ఈర్షద్, మార్కెట్ కమిటీ చేర్మెన్ సంగ్యా నాయక్,గ్రామ సర్పంచ్ ఆకారపు రమ మహేష్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి,నాయకులు రూపేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజేందర్,మహీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.