బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్‌డీలపై వడ్డీ రేట్ల పెంపు
ముంబై, ఏప్రిల్ 19: బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. తాజా సవరణతో 7 రోజుల నుంచి పదేండ్ల వరకూ వివిధ కాలపరిమితుల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు 3 శాతం నుంచి 7.25 శాతం శ్రేణిలో ఉన్నాయి. 6 నెలల పైబడిన ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు (0.50 శాతం), సూపర్ సీనియర్ సిటిజన్లకు అదనంగా 65 బేసిస్ పాయింట్లు (0.65 శాతం) వడ్డీ లభిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. మూడేండ్లుపై బడిన ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు మరో 25 బేసిస్ పాయింట్లు (మొత్తం 0.75 శాతం), సూపర్ సీనియర్ సిటిజన్లకు మరో 25 బేసిస్ పాయింట్లు (మొత్తం 0.90 శాతం) వడ్డీని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది.
తాజా ఎఫ్‌డీ రేట్లు
కాల వ్యవధి వడ్డీ
7 రోజులు రోజులు 3.00 శాతం
46 రోజుల నుంచి 179 రోజులు 4.50 శాతం
180 రోజుల నుంచి 269 రోజులు 5.50 శాతం
270 రోజుల నుంచి ఏడాదిలోపు 5.75 శాతం
1 ఏడాది నుంచి రెండేండ్లలోపు 6.80 శాతం
రెండేండ్ల ఎఫ్‌డీ 7.25 శాతం
మూడేండ్లలోపు 6.75 శాతం
మూడేండ్ల నుంచి ఐదేండ్లలోపు 6.50 శాతం
ఐదేండ్ల నుంచి పదేండ్లలోపు 6.00 శాతం






