calender_icon.png 15 January, 2026 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలి

15-01-2026 12:00:00 AM

వికారాబాద్, జనవరి -14:  క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, క్రీడల్లో రాణించిన చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారని మద్గుల్ చిట్టంపల్లి  మాజీ కౌన్సిలర్ పాండు అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శ్రీ చైతన్య యువజన సంఘం సభ్యులు గాండ్ల శ్రీకాంత్, వీరేందర్, వెంకట్ తదితరుల ఆధ్వర్యంలో బుధవారం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ప్రారంభ సమావేశాన్ని మాజీ కౌన్సిలర్ కుమ్మర్పల్లి గోపాల్ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సాయంత్రం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో  పలువురు సీనియర్ ప్లేయర్స్  మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా శ్రీ చైతన్య యోజన సంఘం ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నీటి యువత చెడు అలవాట్లకు పోకుండా క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలన్నారు. ఈ టోర్నమెంట్లో 8 టీంలు తలపడగా వెంకట్ టీం మొదటి బహుమతి, రాజేష్ టీం రెండో బహుమతి గెలుచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విజేతలకు సీనియర్ వాలీబాల్ ప్లేయర్స్ నగదు బహుమతులను మెమెంటేస్ను అందజేశారు.