ఏసీపీ వెంకటరెడ్డికి సంక్రాంతి శుభాకాంక్షలు
15-01-2026 12:00 AM
రాజేంద్రనగర్ జనవరి 14 (విజయక్రాంతి) : కల్వకుర్తి ఏసిపి వెంకట్ రెడ్డికి ఏఐటియూసీ రంగారెడ్డి జిల్లా నాయకులు వనంపల్లి జైపాల్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం కల్వకుర్తి లోని ఏసీపీ కార్యాలయానికి వెళ్లిన జైపాల్ రెడ్డి పుష్ప గుచ్చాన్ని అందజేసి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపామన్నారు. భగవంతుడి ఆశీర్వాదంతో నిండు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరడం జరిగింది అన్నారు. ఒకరికొకరు క్షేమ సంతో షాలు పంచుకున్నట్లు జైపాల్ రెడ్డి తెలిపారు.




