21 March, 2026 | 3:35 AM

స్వల్ప పెరుగుదల సరిపోతుందా?

21-03-2026 02:03 AM

మైనార్టీ సంక్షేమానికి రూ.3,591 కోట్లు

గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.178 కోట్ల పెంపు

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): రాష్ట్ర 2026 బడ్జెట్‌లో మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం రూ.3,769 కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం (2025 ఈ కేటాయింపు రూ. 3,591 కోట్లుగా ఉండగా, ఈసారి రూ. 178 కోట్లు అదనంగా పెరిగింది. శాతాల పరంగా చూస్తే, మైనారిటీ సంక్షేమ బడ్జెట్‌లో సుమారు 4.95 శాతం పెరుగుదల నమోదైంది. గతంతో పోలిస్తే ఇది స్వల్ప పెరుగుద లగానే కనిపిస్తున్నప్పటికీ, సంక్షేమ కార్యక్రమాల విస్తరణ దృష్ట్యా ఇది ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రభుత్వం ఈ నిధులను ప్రధానంగా విద్యా సహాయం, స్కాలర్‌షిపులు, విదేశీ విద్య పథకాలు, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు, మసీదు అభివృద్ధి వంటి అంశాలకు వినియోగించే అవకాశం ఉంది. ప్ర త్యేకంగా యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ పెరుగుదల అవసరాలకు తగినంత లేదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మైనారిటీ వర్గాల జనాభా, వారి ఆర్థికసామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, మరింత గణనీయమైన కేటాయింపులు అవసరమని వారు సూచిస్తున్నారు. గతంలో పథకాల అమలు కూడా పూర్తిస్థాయిలో జరగకపోవడం మరో సవాల్‌గా ఉంది. మొత్తం గా చూస్తే, ఈ బడ్జెట్‌లో మైనారిటీ సంక్షేమానికి కేటాయింపులు పెరగడం సానుకూలమే అయినప్పటికీ, పెరుగుదల పరిమితంగానే ఉండడం, అలాగే అమలు సామర్థ్యం కీలక అంశాలుగా మారనున్నాయి.