4 May, 2026 | 12:24 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలి

09-03-2026 01:53 AM

కాగజ్‌నగర్,  మార్చి 8 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం కాగజ్‌నగర్ పట్టణం లోని అంబేద్కర్ చౌక్ ఎదుట ప్లే కార్డులతో ఆందోళన చేపట్టారు. గృహ వినియోగ గ్యాస్‌పై రూ.60, కమర్షియల్ గ్యాస్‌పై రూ.115 పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కూషణ రాజన్న మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాల కారణంగానే గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట శ్రీనివాస్, దుర్గం, దినకర్, జిల్లా కమిటీ సభ్యులు టికానంద్, నాయకులు కృష్ణమాచారి, సుధాకర్, రవి, రాజేందర్, ముంజం, హానీషా తదితరులు పాల్గొన్నారు.