13 August, 2026 | 10:01 PM

జూబ్లీహిల్స్‌లోని ‘ది వరల్డ్‌’ స్వాతంత్య్ర దినోత్సవ ప్రచారం

13-08-2026 09:18 PM

హైదరాబాద్: ఆగస్టు 2026 : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ప్రత్యేక నివాళిగా, హైదరాబాద్‌లోని అల్ట్రా-లగ్జరీ ప్రాజెక్ట్ అయిన 'ది వరల్డ్ ఎట్ జూబ్లీ హిల్స్', జన గణ మన గీతానికి ఒక అందమైన రాగాన్ని సృష్టించడానికి దేశవ్యాప్తంగా 50 శబ్దాలను ఒకచోట చేర్చి ఒక వినూత్న సంగీత ప్రచారాన్ని సృష్టించింది.

చెన్నైకి చెందిన ‘బీ పాజిటివ్ 24 ఇన్నోవేషన్ డిజైన్’ సంస్థ రూపొందించి, సృష్టించిన ఈ కొత్త ప్రచారంలో, దేశవ్యాప్తంగా సేకరించిన 50కి పైగా విభిన్న శబ్దాలను ఉపయోగించారు. రాకెట్ ప్రయోగం, వెళ్తున్న రైలు, పక్షులు, పాఠశాల గంటలు, దేవాలయ గంటలు, వీధులు, ప్రజలు, సంగీత వాయిద్యాలు, ప్రకృతి కదలికల వంటి శబ్దాలన్నింటినీ కలిపి జాతీయ గీతం బాణీలో ఒకే పాటగా మలిచారు.

"భారతదేశం మా ఇల్లు. మా అందమైన ఇంటికి ఇది ఒక సంగీత నివాళి. ఒక డెవలపర్‌గా, మేము ఎల్లప్పుడూ ఆవిష్కరణల ద్వారా ఆనందాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుంటాము. ఆలోచనల పరంగా సరళంగా ఉంటూనే, భావోద్వేగ పరంగా ఒక శక్తివంతమైన పనిని మేము చేయాలని కోరుకున్నాము." అని 'ది వరల్డ్ ఎట్ జూబ్లీ హిల్స్' సీఈఓ సిద్ధార్థ్ రెడ్డి ఇందుకూరి అన్నారు.

"మేము 100కు పైగా శబ్దాలను రికార్డ్ చేసి, వాటితో వారాల తరబడి ప్రయోగాలు చేశాము. సంగీతపరంగా అర్థవంతంగా కలిసివచ్చే వాటిని ఎంచుకున్నాము. ఈ సౌండ్ మరియు ఫిల్మ్ 35 కంటే ఎక్కువ మార్పులకు గురయ్యాయి. అన్నింటినీ ఒకచోట చేర్చడానికి మాకు దాదాపు 100 రోజులు , పలువురు భాగస్వాములు అవసరమయ్యారు. ఇది చాలా శ్రమతో కూడుకున్నది అయినప్పటికీ అద్భుతమైన ఫలితం వచ్చింది " అని 'బీ పాజిటివ్ 24 ఇన్నోవేషన్ డిజైన్' వ్యవస్థాపకుడు అభిషేక్ డి షా అన్నారు.ఈ ప్రచార చిత్రం ఆగష్టు 12, 2026 నుంచి 'ది వరల్డ్ ఎట్ జూబ్లీ హిల్స్' యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం అవుతుంది. దీనితో పాటుగా బ్రాండ్ యొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రచారం చేయబడుతుంది.