అంబేద్కర్ నగర్లోని పెట్రోల్ బంకులో మోసం
42 లీటర్లు సామర్థ్యం గల కారులో... 53 లీటర్ల డీజిల్ పోసిన వైనం
వినియోగదారుల... ఆందోళనలతో బంకును మూసిన యజమానులు
బంకులో మాయాజాలాన్ని చూసి నివ్వరపోతున్న వినియోగదారులు
జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ అంబేద్కర్ నగర్ భారత పెట్రోల్ బంకులో మోసం చోటుచేసుకుంది. స్విఫ్ట్ డిజైర్ కారులో డీజిల్ పోసుకునేందుకు బుధవారం రాత్రి సందీప్ అనే వినియోగదారుడు వచ్చాడు. కారు డీజిల్ సామర్థ్యం 42 లీటర్లు కాగా 53 లీటర్ల డీజిల్ బంకు సిబ్బంది పోయడం మిస్మయానికి గురిచేసింది.
బంకు నిర్వాహకుల మాయజాలంతో అమాయక ప్రజలు మోసపోతున్నారని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. నాణ్యమైన పెట్రోలు డీజిల్ పోస్తారు అనుకుంటే వినియోగదారుల నమ్మకం పోయేలా చేయడం తగదని సందీప్ వాపోయాడు. ఈ ఘటనపై ఉప్పల్ సర్కిల్ సివిల్ సప్లై అధికారి సంధ్య సిబ్బందితో కలిసి బంకును పరిశీలించారు. ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ తూనికలో కొలతలలో ఎలాంటి లోటుపాట్లు లేవని నిర్ధారించారు.
పెట్రోల్ బంకులో వసతులు సరిగ్గా లేవని ఉన్నతాధికారులకు విన్నవిస్తున్నామన్నారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారి ఎండి రియాజ్ అహ్మద్ ఖాన్ తెలిపారు. బాధితుడు డీజిల్ పోసుకున్న తర్వాత అంబేద్కర్ నగర్ వరకు ఐదు నిమిషాల కాలం వెళ్లి వచ్చినందువల్ల తప్పు జరిగిన చట్ట ప్రకారం యాజమాన్యంపై చర్యలు తీసుకోలేమని అధికారులు తెలపడంతో అధికారులు యాజమాన్యంతో కుమ్మక్కై నన్ను మోసం చేశారని నాలాగా రోజుకు వేలాదిమంది మోసపోతున్నారని బాధితుడు సందీప్ వాపోయాడు.






