సమాజంలో బలమైన... కుటుంబాలకై బాటలు వేద్దాం.

13-08-2026 | 09:53pm

గో ఇండియా ట్రస్ట్ బోర్డు మెంబర్ విన్యాన్ ఐజాక్

జవహర్ నగర్,(విజయక్రాంతి): ఆధునిక కాలంలో కుటుంబాలు చిన్న పొరపాట్లకే జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని అవగాహనతోనే సమస్యలు దూరమవుతాయని సమాజంలో బలమైన కుటుంబాలకై బాటలు వేద్దామని గో ఇండియా ట్రస్ట్ బోర్డ్ మెంబర్ విన్యాన్ ఐజాక్ అన్నారు. జవహర్ నగర్ గబ్బిలాల పేటలో గో ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో బలమైన కుటుంబాలు అనే కార్యక్రమం పై గురువారం స్థానిక ప్రజలు విద్యార్థులతో కలిసి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విన్యాన్ ఐజాక్ మాట్లాడుతూ చిన్నప్పటినుండే విద్యార్థులు మంచి సత్ప్రవర్తలతో మెలగాలని చదువుతూనే భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మాధవి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు