మండలంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఎర్రుపాలెం ఆగస్టు 15(విజయక్రాంతి): ఎర్రుపాలెం మండలంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల తాసిల్దార్ కార్యాలయం నందు ఎమ్మార్వో సునీత ఎలిజిబెత్ , ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీడీవో శారద జెండా ఎగరవేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్సై రమేష్ జెండా ఎగరవేశారు. గ్రామాలలోని గ్రామ సర్పంచులు మువ్వన్నెల జెండా ఎగరవేశారు.
వివిధ ప్రభుత్వ కార్యాలయంలో, ప్రభుత్వ పాఠశాలలో, గురుకుల పాఠశాలలో , కస్తూరిబా పాఠశాలలో ,వివిధ ప్రవేట్ పాఠశాలలో జెండా ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెంకటాపురం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి లో అత్యధిక మార్కులు పొందిన వేమిరెడ్డి ఉమాశ్రీకి గ్రామ సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి 3000 ప్రోత్సాక బహుమతిని అందించారు. ఎస్ జె కే యం కళాశాలలో ప్రిన్సిపల్ నాగిరెడ్డి సౌజన్య జెండా ఎగర వేశారు. ఎస్ వి అకాడమీ చైర్మన్ మిరియాల శ్యాంప్రసాద్ జెండా ఎగరవేశారు. ప్రవేట్ పాఠశాలలో విద్యార్థుల నృత్యాలు అలరించాయి.






