15 August, 2026 | 1:17 PM

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 01:07 PM

 జెండా ఆవిష్కరణ - సిబ్బందికి సన్మానం

జనగామ, (విజయక్రాంతి):  80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జనగామలోని 13వ వార్డులో ఘనంగా జెండా వందన కార్యక్రమం జరిగింది. 13వ వార్డు కౌన్సిలర్ పానుగంటి సువార్త ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వార్డు పరిధిలోని మున్సిపల్, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, విద్యుత్, నీటి సరఫరా తదితర ప్రభుత్వ శాఖల సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సువార్త మాట్లాడుతూ, "స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ శాంతి, సమైక్యతను కాపాడాలి" అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వార్డు మహిళలు, స్థానిక నాయకులు, వివిధ శాఖల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.