7 April, 2026 | 1:40 PM

Breaking News

కేరళ సీఎంకు తెలంగాణ సీఎం సవాల్!   •   తెలంగాణలో గడ్డి మందు నిషేధం   •   సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   షాకింగ్ ఘటన: బంధువుల దాడిలో న్యాయవాది హత్య.. అన్నమయ్య జిల్లాలో కలకలం!   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •  

ఆ కుర్చీకి మీరు అనర్హులు

18-02-2026 12:00 AM

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై పార్టీ సీనియర్ నేత నవజ్యోత్ కౌర్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 : కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన పంజాబ్ మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధూ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీలో ఏం జరుగుతుందో తెలియని వ్యక్తి నాయకత్వ పదవిలో కూర్చోవడానికి అనర్హుడంటూ ఘాటు వ్యా ఖ్యలు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఏఐసీసీ పంజాబ్ వ్యవహారాల ఇన్‌చార్జ్ భూపేష్ బఘేల్, ఫిబ్రవరి 6న నవజ్యోత్ కౌర్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

పంజాబ్ సీఎం కావాలంటే ‘రూ.500 కోట్ల సూట్కేస్’ అవసరమంటూ ఆమె గత ఏడాది డిసెంబర్లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మొదట సస్పెండ్ చేసి, ఆ తర్వా త ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడిన ఆమె.. రాహుల్ వాస్తవ పరిస్థితులకు దూరంగా ఒక ‘స్వయం నిర్మిత స్వర్గం’ లో బతుకుతున్నారని విమర్శించారు. ‘మీ కింద ఏం జరుగుతుందో మీకు తెలియకపో తే, క్షమించండి..

మీరు ఆ కుర్చీకి అర్హులు కారు‘ అని ఆమె వ్యాఖ్యానించారు. రాహుల్ చుట్టూ ఉన్న కోటరీ ఎన్నికల టికెట్లను ముం దుగానే అమ్మేసుకుంటోందని, నిజాయతీపరుల మాట వినే సమయం ఆయనకు లేదని ఆరోపించారు. బహిష్కరణ అనంతరం సోషల్ మీడియాలో రాహుల్‌ను ఉద్దేశించి ‘పప్పు’ అంటూ వివాదాస్పద పోస్ట్ చేసిన కౌర్, ప్రధాని మోదీ పనితీరును ప్రశంసించడం గమనార్హం. అయితే, తన భార్య వ్యాఖ్యలు, బహిష్కరణపై కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న ఆమె భర్త నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇప్పటివరకు మౌనంగానే ఉండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.