18 March, 2026 | 10:24 PM

బ్రిడ్జ్ గేమ్స్ ఫైనల్లో భారత్

03-11-2024 12:00 AM

బ్యూనస్ ఎయిర్స్: వరల్డ్ బ్రిడ్జ్ గేమ్స్‌లో భారత సీనియర్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీస్‌లో భారత్ 195-129 తేడాతో స్వీడన్‌పై విజయం సాధించింది. భారత్ తరఫున కమల్ ముఖర్జీ, విభాస్ తోడి, బదల్ దాస్, ప్రణబ్ బర్దన్, అరుణ్ బపాట్, రవి గోయెంకాలతో కూడిన బృందం బరిలోకి దిగింది. అంతకముందు క్వార్టర్స్‌లో కెనడాను, ప్రిక్వార్టర్స్‌లో స్కాట్లాండ్‌ను చిత్తు చేసింది.