17 August, 2026 | 1:45 AM

పాపన్న విగ్రహం ఆవిష్కరణను జయప్రదం చేయాలి

17-08-2026 01:13 AM

బాలగోని బాలరాజ్ గౌడ్ 

ముషీరాబాద్,ఆగస్టు 16(విజయక్రాంతి): బహుజన రాజ్యస్థాపకుడు గొల్కొండ కోటపై జెండాను ఎగురవేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ప్రతిష్టించున్నానరని వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటి చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ లు పిలుపునిచ్చారు.

ఆదివారం చిక్కడపల్లిలోని తన కార్యాలయంలో విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల18వ తేదిన సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్ పైన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించబడే ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్లు పాల్గొంటారని తెలిపారు.

ఉదయం 9 గంటలకు చిక్కడపల్లిలోని కల్లు కంపౌండ్ వద్ద పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు.ఈ పోస్టర్ ఆవిష్కరణలో బీసీ పొలిటికల్ ప్రంట్ వైస్ చైర్మన్ ఎస్. దుర్గయ్య గౌడ్, గౌడ్ ఐక్యసాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, బైరు శేఖర్, గడ్డ మీది విజయ్ కుమార్ గౌడ్, వి. నాగభూషణం, సింగం నాగేశ్వర్, దామోదర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.