17 August, 2026 | 2:46 AM

సామాజిక సేవకురాలు రాగం సుజాత యాదవ్ మృతిపై రఘువీర రెడ్డి సంతాపం

17-08-2026 01:05 AM

శేరిలింగంపల్లి,ఆగస్టు 16(విజయక్రాంతి): తెలంగాణ, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్పర్సన్గా పనిచేసిన ప్రముఖ సామాజిక సేవకురాలు రాగం సుజా త యాదవ్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.ఆమె మృతి వార్త తెలిసి ఏఐసీసీ సీడబ్ల్యుసి సభ్యులు, మాజీ పీసీసీ అధ్యక్షులు డాక్టర్ ఎన్. రఘువీర రెడ్డి నల్లగండ్లలోని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నివాసానికి ఆదివారం చేరుకున్నారు.

అక్కడ రఘువీర రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, మహిళా సాధికారత కోసం సుజాత యాదవ్ చేసిన కృషి చిరస్మరణీయమని ఆయన అభివర్ణించారు. ఆమె మరణం సామాజిక రంగానికి తీరని లోటని వ్యాఖ్యానించారు.భగవంతుడు ఆమె ఆత్మకు శాంతి ప్రసాదించాలని, కుటుంబసభ్యులకు ధైర్యం కలిగించాలని రఘువీర రెడ్డి ప్రార్థించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు సహా పలువురు హాజరయ్యారు.