calender_icon.png 19 February, 2026 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక

19-02-2026 02:15:49 AM

ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు పాషామియా

జవహర్ నగర్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): విద్వేషాలను దూరం చేసి ఐకమత్యంగా జీవనం సాగిద్దామని కోవాబన్ వివాదాన్ని దుష్ప్రచారం చేయవద్దని భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు పాషామియా అన్నారు. ఇటీవల సమ్మక్క సారక్క జాతరలో చోటు చేసుకున్న కోవాబన్ వివాదాన్ని అపహస్యం చేయడాన్ని నిరసిస్తూ గ్రేటర్ హైదరాబాద్ పరిధి జవహర్ నగర్ దేవేందర్ నగర్ లో ముస్లిం కమిటీ కార్యదర్శి కాలేషా ఆధ్వర్యంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసం ఘాల సమక్షంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా కోవాబన్ పై రాద్దాంతం చేసి యూట్యూబ్లో మీడియాలో పలువురు అసత్యపు ప్రచారం చేసిన వారిపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్, అభ్యుదయ రచయిత షేక్ మీరా, ఏఐఎఫ్ టు యు అధ్యక్షుడు మల్లేష్, ఇఫ్టు జాతీయ కన్వీనర్ షేక్షావలి, పెరక సునీత, మహినుద్దీన్, వహీద్, సయ్యద్, అలీ పాల్గొన్నారు.