calender_icon.png 1 October, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘అణు’ బ్లాక్‌మెయిల్‌కు భారత్ భయపడదు!

01-10-2025 12:00:00 AM

మిలటరీ నర్సింగ్ సర్వీసెస్ శతాబ్ది ఉత్సవాల్లో సీడీఎస్ అనిల్ చౌహాన్

ఢిల్లీ, సెప్టెంబర్ ౩౦: ఏ దేశం నుంచి వచ్చే అణ్వాయుధాల బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కు భారత్ భయపడదని, ఎలాంటి పోరా టానికైనా సిద్ధంగా ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్  ధీమా వ్యక్తంచేశారు. మిలటరీ నర్సింగ్ సర్వీసెస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మం గళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన వేడుకలో ఆయన మాట్లాడారు. ౧౯౨౬లో స్థాపిం చిన మిలటరీ నర్సింగ్ సర్వీస్ వందేళ్లుగా దేశ సైన్యానికి సేవలు అందిస్తున్నదని కొనియాడారు.

సైనికులు దేశ సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్నా, సముద్ర జలాల్లో పోరాటం చేస్తున్నా.. వారికి నర్సింగ్ సిబ్బంది అన్ని విధాలుగా అండగా ఉన్నారని, వారిని అనుక్షణం కాపాడుతూ వచ్చారని ప్రశంసించారు. అనంతరం ఆయన యుద్ధసంపత్తి గురించి మాట్లాడుతూ..

‘ఆపరేషన్ సిందూ ర్’ సమయంలో ప్రధాని మోదీ కూడా అ ణ్వాయు ధాలపై తమతో చర్చించారని, ఏ దేశం అణ్వాయుధాల పేరుతో బెదరకూడదని సూచించారని గుర్తుచేసుకున్నారు. భవిష్యత్‌లో అణు బెదిరింపులు, రేడియా ధార్మిక పదార్థాల ప్రయో గాలు ఉండొచ్చని అంచనా వేశారు. వాటిని ఎదుర్కోవాలంటే రేడియ ధార్మిక కాలుష్యాన్ని ఎదుర్కొనే సైనిక శిక్షణ అవసరమన్నారు.