01-10-2025 12:00:00 AM
పాట్నా, సెప్టెంబర్ 30( విజయక్రాంతి) : బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను భారత ఎన్నికల సం ఘం మంగళవారం ప్రకటించింది. స్పెషల్ ఇంటన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) పూర్తయిన తర్వాత బీహార్‌లో 7.24 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపింది. ఏ ఓటరు అయినా తన ఓటు నమోదు వివరాలను భారత ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో వీక్షించ వచ్చని పోల్‌బాడీ అధికారులు తెలిపారు.
22ఏళ్ల తర్వాత బీహార్‌లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ కసరత్తు రాజకీయ, చట్టపరమైన చర్చలకు కేంద్రంగా నిలిచింది. ఆగస్టు 1న ము సాయిదా ఓటర్ల జాబితా విడుదల కాగా, సెప్టెంబర్ 1 వరకు అభ్యంతరాలకు గడువు ఇచ్చారు. ప్రక్రియకు ముందు బీహార్‌లో 7.89కోట్ల మం ది ఉండగా ముసాయిదా జాబితా లో 7.24 కోట్లు ఉన్నట్లు తేలింది. కాగా, ఈ నెల 6 లేదా 7న ఎలక్షన్ షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నాయి.