calender_icon.png 1 October, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాజాపై ట్రంప్ శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మోదీ

01-10-2025 12:00:00 AM

పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలకు మేలు జరుగుతుందని ట్వీట్

ఢిల్లీ, సెప్టెంబర్ 30: గాజా వివాదానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన శాంతి ప్రణాళికను మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ మేరకు తాజాగా మోదీ ‘ఎక్స్’ ద్వారా స్పందించారు. ‘గాజాలో శాంతి నెలకొల్పేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధం చేసిన ప్రణాళికను తాము స్వాగతిస్తున్నాం. ఇది పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నాం.

పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు దోహదపడుతుందని ఆకాంక్షిస్తున్నాం’ అని మోదీ పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగు తున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల 21 సూత్రాల శాంతి ఫార్ములాను సూచించిన సంగతి తెలిసిందే. ఆ ప్రయత్నాలపై ఇ ప్పటికే గల్ఫ్ దేశాలు స్వాగతించాయి. ఖతర్, జోర్దాన్, యూఏఈ, ఇండోనేసియా, పాకిస్థాన్, ఈజిప్టు, తుర్కియే, సౌది అరేబియా దేశాలు కలిసి సంయుక్తంగా మద్దతు ప్రకటించాయి.

యుద్ధం ముగింపునకు ట్రంప్ సూచించిన ప్రణాళికను ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు సైతం అంగీకరించారు. హమాస్ కూడా ట్రంప్ ప్రణా ళికను అంగీకరించాలని, లేనిపక్షంలో హ మాస్ అంతం తప్పదని హెచ్చరించారు. అ టు హమాస్ కూడా తమవద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను వదిలేసేందుకు సి ద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అయితే ట్రంప్ సూచించిన ప్రణాళిక ఏదీ తమకు అందలేదని, అవి అందాక అధ్యయనం చేసి తమ అభిప్రాయం తెలుపుతామని హమాస్ స్పష్టం చేసింది.