నాసా చీఫ్‌గా ఐజాక్‌మెన్
ప్రకటించిన ట్రంప్
వాషింగ్టన్, డిసెంబర్ 5: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన టీంను ప్రకటిస్తున్నారు. ఈ మేరకు అమెరికా అంతరిక్ష సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) క్తొత చీఫ్‌గా ప్రైవేట్ వ్యోమగామి, ‘షిఫ్ట్4 పేమెంట్స్’ కంపెనీ సీఈవో జేర్డ్ ఐజాక్‌మెన్(41)ను నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో తెలిపారు.
స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు బిజినెస్ పార్ట్‌నర్ అయిన ఐజాక్‌మాన్ ఎంపిక చర్చనీయంగా మారింది. ఈ సందర్భంగా ఐజాక్‌మాన్‌ను నాసా చీఫ్‌గా నామినేట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని ట్రంప్ తెలిపారు. ఆయన నాయకత్వంలో నాసా మరింత పురోగతి సాధించిస్పేస్ సైన్స్, టెక్నాలజీలో సరికొత్త లక్ష్యాలను చేరుకుంటుదని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.






