11 May, 2026 | 7:59 PM

పెరుగుతున్న వస్తు వినియోగం

08-05-2024 12:05 AM

భారతదేశం మరో నాలుగేళ్లలో అమెరికా, చైనాల తర్వాత అతిపెద్ద వినియోగ మార్కెట్టుగా మూడో స్థానాన్ని పొందగలదని యుబీఎస్ (అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్  యూబీఎస్) ప్రకటించడం  సంతోషదాయకం. 2028 కల్లా మన దేశం జర్మనీ, జపాన్‌ల వినియోగాన్ని అధిగమిస్తుందని తెలుస్తున్నది. అధికాదాయ వర్గాల సంఖ్యతోపాటు మధ్యతరగతి కొనుగోలు శక్తి కూడా పెరుగుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. 

 విశ్వనాథ్, బండ్లగూడ