3 July, 2026 | 5:15 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

కూలీలకు సౌకర్యాలు కల్పించాలి

08-05-2024 12:05 AM

తెలంగాణ రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ పనులకు వెళ్లే కూలీలకు తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్) కిట్లు అందుబాటులో ఉంచాలి. అదే విధంగా వారికి ఎండ తగలకుండా సేద తీర్చుకోవడానికి టెంట్, చలువ పందిళ్లు వేయించా ల్సి ఉంది. పనులు ప్రారంభమై రోజులు గడుస్తున్నా చాలా ప్రాం తాలు, గ్రామాల్లో అవి అందుబాటులో ఉంచడం లేదు. వారికి సర్కారు నిర్ణయించిన సౌకర్యాలు కల్పించడం లేదు. తాగడానికి మంచినీళ్లు కూలీలు తమ ఇళ్లనుంచే తెచ్చుకుంటున్న పరిస్థితి కన్పిస్తున్నది. మధ్యాహ్నం 12 గంటల వరకు పని చేయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వడదెబ్బతో ఉపాధి హామీ కూలీలు మృతి చెందిన ఘటనలు ఈ మధ్య కనిపించాయి. ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి వసతులు కల్పించాలి.

తలారి గణేష్, వెల్లంకి, యాదాద్రి జిల్లా