calender_icon.png 2 November, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడో టీ20లో భారత్ విజయం

02-11-2025 05:25:31 PM

హోబార్ట్: ఆస్ట్రేలియాలోని హోబార్ట్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచులో ఆస్ట్రేలియాపై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 18.3 ఓవర్లలోనే మ్యాచును ముగించింది. చివర్లో వాషింగ్టన్ సుందర్(49*), జితేష్ శర్మ(22*) అద్భుత ప్రదర్శనతో రాణించారు. దీంతో 5 టీ20 సిరీస్ లో 1-1 తో ఇరుజట్లు సమంగా ఉన్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఆర్ష్ దీప్ సింగ్ 3, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకున్నారు.