24 March, 2026 | 2:54 PM

మణికొండలో ఇండియన్ కరల్స్ సలోన్

24-03-2026 01:39 AM

సినిమా, టెలివిజన్ నటీనటుల సమక్షంలో ఘనంగా ప్రారంభోత్సవం

హైదరాబాద్, మార్చి 23: ఇండియన్ కరల్స్ అనే ప్రీమియం హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ సలోన్ మణికొండలో సోమవారం ఘనం గా ప్రారంభమైంది. నాణ్యత, ఖచ్చితత్వం, వ్యక్తిగత శ్రద్ధకు ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేకమై న హెయిర్ స్టైలింగ్, ఎక్స్టెన్షన్ సేవలను అం దించడానికి ఈ సలోన్ ఏర్పాటైంది.కంకనాల బాలకృష్ణ స్థాపించిన ఇండియన్ కర్ల్స్ హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్‌కు క్రమబద్ధమైన విధానాన్ని అనుసరిస్తూ, ప్రతి కస్టమర్‌కు సరిపోయే విధంగా వివరమైన కన్సల్టేషన్, భారతీయ జుట్టు స్వభావానికి అనుకూలమై న టెక్నిక్స్ మరియు స్థిరమైన సేవలను అం దించడంపై దృష్టి సారిస్తోంది.

నాణ్యమైన వనరుల వినియోగం, సరైన ప్రక్రియల ద్వా రా దీర్ఘకాలిక ఫలితాలను అందించడాన్ని ల క్ష్యంగా పెట్టుకుంది.బిజినెస్ డెవలప్‌మెంట్‌లో అనుభవం కలిగిన బాలకృష్ణ, అంత ర్జాతీయ స్థాయి శిక్షణతో కూడిన నైపుణ్యాన్ని ఈ రంగంలో ప్రవేశపెట్టి, నిపుణుల బృం దంతో సిస్టమ్ ఆధారిత సేవలను అందిస్తున్నారు. అన్ని కస్టమర్లకు ఒకే విధమైన నాణ్య త అందేలా ప్రమాణిత విధానాలను అనుసరిస్తున్నారు.

అంబియెన్స్ కోర్ట్‌యార్డ్ ఎదుట ఉన్న సలోన్ ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు సినిమా, టెలివిజన్ నటీనటులు హాజరయ్యారు. హిమజా రెడ్డి, నయనీ పవని, శ్రీ సత్య, మంజుల పరిటాల, నిరుపమ్, బెజవాడ బేబక్క, విశ్వ, హరిత తోట, అంజలి, పవన్ తదితరులు పాల్గొని తమ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భం గా కంకనాల బాలకృష్ణ మాట్లాడుతూ, ఇం డియన్ కర్ల్స్ నాణ్యత , స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రారంభించాం. కస్టమర్లకు సరైన మార్గదర్శకత్వం, అనుకూలమైన టెక్నిక్స్, విశ్వసనీయమైన సేవలను అందించడం మా లక్ష్యం. ప్రతి ఒక్కరూ విశ్వాసంతో సేవలు పొందగలిగే వాతావరణాన్ని సృష్టించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.