24 March, 2026 | 1:10 PM

ముగిసిన ఐఐఎంసీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం

24-03-2026 01:41 AM

తిమ్మాయిపల్లి, ధర్మారం గ్రామాల్లో వారం రోజుల పాటు సేవా కార్యక్రమాల నిర్వహణ

ఖైరతాబాద్, మార్చి 23(విజయక్రాంతి): ఐఐఎంసీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 1,2 ఆధ్వర్యంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్లో గల తిమ్మాయిపల్లి, ధర్మారం గ్రామాల్లో జాతీ య సేవా పథక ప్రత్యేక శిబిరం వారం రోజు ల పాటు ఈ నెల16   నుంచి 22 వరకు ఏ ర్పాటు చేశారు.

ఆరవ రోజు ఈ నెల 21న ఉదయం సూర్యనమస్కారాలతో ప్రారంభ మై ధ్యాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగ, ధ్యాన ప్రక్రియపై అవగాహన సదస్సును నిర్వహించారు. అనంతరం ధ్యాన్ ఫౌండేషన్ సభ్యులు మహాబీర్ యోగాసనాలను వాలంటీర్లచే అభ్యసన చేయించారు.అదేవిధంగా ధ్యానం ప్రాముఖ్యతను తెలియజేస్తూ వివిధ రకాల ధ్యానముద్రలు వాటి వలన ఉపయోగాలను వివరించి ధ్యానం చేయించారు. ఆ తర్వాత తిమ్మాయిపల్లి గ్రామ ప రి సరాల్లో ఉన్న నాగశైన్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న గోశాలలో గోవులు నివసించే పరిసరాలను శుభ్రం చేశారు.

గో సంరక్షణే దేశ సంరక్షణ అని వాలంటీర్లు గో సేవలో నిమగ్నమయ్యారు.భోజన విరామానంతరం ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు మానసికోలాసాన్ని పెంచే వివిధ రకాల క్రీడలను ఆడారు.  ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు రోజు ఈ నెల 22న వాలంటీర్లకు క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వాలంటీ ర్లు ఎంతో ఉత్సాహంగా 9 టీమ్‌లుగా పాల్గొ ని ఉత్తమ ప్రతిభ కనబరిచిన మూడు టీము ల వారు బహుమతులు గెలుపొందారు. అ నంతరం జరిగిన ముగింపు సమావేశంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 1 ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎం. సత్యనారాయణ, ఎన్‌ఎస్‌ఎస్ యూని ట్ 2 ప్రోగ్రాం ఆఫీసర్ ఇ. రామకృష్ణ మాట్లాడుతూ గత వారం రోజులపాటు నిర్వహించి న శిబిరంపై నివేదికను సమర్పించారు.

ఇలాంటి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తే విద్యార్థు ల్లో మానసిక అభివృద్ధి పెంపొంది సమా జం పట్ల అవగాహన కలుగుతుందని మేము అది సాధించడంలో ఈ శిబిరం ద్వారా విజయవంతమయ్యామన్నారు. ఇంతటి అవకా శాన్ని కల్పించిన ఉస్మానియా యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ సెల్ కోఆర్డినేటర్ సి. వెంకటేశ్వర్లుకి, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్, ప్రిన్సిపల్ కూర రఘువీర్‌కి, కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంత రం ఎన్ ఎస్‌ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

అనంతరం జనహిత సేవా సమితి ట్రస్టీలు నరసింహమూర్తి, నందకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటినుంచే సమాజం పట్ల సేవా దృక్పథంతో మెలగాలని అభిలాషించారు. ఇంటలెక్చువల్ ఛాలెంజ్డ్ స్కూల్ అధ్యాపకురాలు శ్రీదేవి మాట్లాడుతూ ప్రతి వారిపట్ల స ద్భావనా దృక్పథంతో ఉండాలని, సేవానిరతి ప్రతి ఒక్క రిలో ఉండాలన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఇ.రామకృష్ణ, ఎం.సత్యనారాయణ అతిథులను సత్కరించారు. కార్య క్రమంలో కళాశాల అధ్యాపకులు ఎం. విజ య్, బండా శ్యాంసుందర్, విజయానం ద్ గౌడ్, నిరంజన్ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.