14 July, 2026 | 11:26 PM

భారత్ బోణీ

29-04-2024 12:20 AM

సిల్హెట్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత అమ్మాయిల జట్టు.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో శుభారంభం చేసింది. ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి పోరులో భారత జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 145 పరుగులు చేసింది. యస్తిక భాటియా (36), షఫాలీ (31), హర్మన్‌ప్రీత్ (30) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 101 పరుగులు చేసింది. రేణుక 3 వికెట్లు పడగొట్టింది.