ఐఓసీ లాభంలో భారీ క్షీణత
52 శాతం తగ్గుదలతో రూ.4,838 కోట్లకు
షేరుకు రూ.7 తుది డివిడెండు
ముంబై, ఏప్రిల్ 30: ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) నిక ర లాభం మార్చి త్రైమాసికంలో భారీగా 52 శాతం క్షీణించి రూ.4,838 కోట్లకు పడిపోయింది. గత ఏడాది క్యూ4లో ఈ లాభం రూ.10,059 కోట్లుగా నమోదయ్యింది. 2023 డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే నికరలాభం రూ. 8,063 కోట్ల నుంచి 40 శాతం తగ్గింది. ఆదాయం ముగిసిన త్రైమాసికంలో స్వీక్వెన్షియల్‌గా 1 శాతం తగ్గింది. నాల్గవ త్రైమాసికంలో రూ. 10,435 కోట్ల ఇబిటాను నమోదు చేసింది. 5.3 శాతం ఇబిటా మార్జిన్లను సాధించింది. మంగళవారం సమావేశమైన కంపె నీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.7 తుది డివిడెండును సిఫార్సుచేసింది. ఏజీఎం తేదీని ప్రకటించిననాటి నుంచి 30 రోజుల్లోగా డివిడెండును చెల్లించనున్నట్టు కంపెనీ తెలిపింది. డివిడెండు చెల్లింపునకు రికార్డుతేదీని తదుపరి ప్రకటిస్తారు.






