100 బిలియన్ డాలర్లకు చమురు దిగుమతి బిల్లు
ఇక్రా అంచనా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ చమురు నికర దిగుమతి బిల్లు 100 కోట్ల డాలర్లను మించుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2023 96.1 బిలియన్ డాలర్ల మేర ముడి చమురును దేశం దిగుమతి చేసుకోగా, ఇది ప్రస్తుత 2024 25 ఆర్థిక సంవత్సరంలో 101.10 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఇక్రా పేర్కొంది. ఇరాన్ ఉద్రిక్తతలు పెరిగితే చమురు దిగుమతు వ్యయం పెరుగుతుందని హెచ్చరించింది. తక్కువ ధరతో జరుగుతున్న రష్యా చమురు దిగుమతుల కారణంగా 2023 ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల కాలంలో భారత్‌కు 7.9 బిలియన్ డాలర్ల మేర ఆదా అయ్యిందని తమ విశ్లేషణలో తేలినట్టు ఇక్రా తెలిపింది.
2022 ఈ రకంగా జరిగిన ఆదా 5.1 బిలియన్ డాలర్లు ఉన్నది. ప్రస్తుత స్థాయిలోనే రష్యా చమురు డిస్కౌంట్‌లో లభించినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికరంగా చమురు దిగుమతుల నికర బిల్లు 101.10 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఇక్రా అంచనాల్లో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో క్రూడాయిల్ సగటు ధర 85 డాలర్లుగా భావిస్తూ ఈ అంచనాలను రూపొందించినట్టు తెలిపింది. అయితే ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రతరమైతే క్రూడ్ ధర పరుగులు తీస్తుందని, దీంతో దిగుమతుల బిల్లు మరింత పెరుగుతుందని తెలిపింది.
ధర 10 డాలర్లు పెరిగితే 12 బిలియన్ డాలర్ల భారం
ఇక్రా అంచనాల ప్రకారం బ్యారల్ కూడాయిల్ సగటు ధర 10 డాలర్ల చొప్పున పెరిగి తే భారత్ నికర దిగుమతుల బిల్లుపై అదనంగా 12.13 బిలియన్ డాలర్ల భారం పడు తుంది. ఈ కారణంగా భారత్ కరెంటు ఖాతా లోటు (క్యాడ్) జీడీపీలో 0.3 శాతం మేర పెరుగుతంది. 2024 బ్యారల్ ముడి చమురు సగటు ధర 95 డాలర్లు ఉంటే కరెంటు ఖాతా లోటు 1.5 శాతానికి చేరుతుందని ఇక్రా హెచ్చరించింది. 85 డాలర్ల సగటు ధరపై ఈ లోటు 1.2 శాతంగా ఉంటుందన్నది ప్రస్తుత అంచనా. 2023 24లో క్యాడ్ 0.8 శాతానికి పరిమితమవుతుందని ఇక్రా అంచన వేస్తున్నది. భారత్ ముడిచమురు వినియోగంలో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నది.






