13 July, 2026 | 9:47 PM

Breaking News

నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •  

టాటా ప్లేలో టాటా సన్స్ వాటా పెంపు

01-05-2024 12:37 AM

టెమ్‌సెక్ నుంచి రూ.835  కోట్ల వాటా కొనుగోలు

ముంబై, ఏప్రిల్ 30: టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ తన డీటీహెచ్ సబ్సిడరీ టాటా ప్లేలో వాటాను 70 శాతానికి పెంచుకున్నది. సింగపూర్ ప్రభుత్వానికి చెంది న ఈక్విటీ ఫండ్ టెమ్‌సెక్ నుంచి 10 శాతం వాటాను టాటా సన్స్ 100 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 835 కోట్లు) కొనుగోలు చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  డైరెక్ట్ టు హోం (డీటీహెచ్) కంపెనీకి 1 బిలియన్ డాలర్ల విలువ కడుతూ తాజా లావాదేవీ జరిగింది. గతంలో దీనికి వాల్యూయేషన్ 3 బిలియన్ డాలర్ల మేర ఉన్నది. దేశంలో అతిపెద్ద డీటీహెచ్ కంపెనీ అయిన టాటా ప్లేకు  (గతంలో టాటా స్కై) 2.1 కోట్ల మందిచందాదారులు ఉన్నారు. ఈ వెంచర్ నుంచి టెమ్‌సెక్ వైదొలగడంతో టాటా ప్లే ఇక నుంచి టాటా లు, వాల్ట్ డిస్నీల మధ్య 70:30 జా యింట్ వెంచర్‌గా కొనసాగుతుంది.  టాటా ప్లేలో డిస్నీ వాటాను కొనుగోలు చేసేందుకు కూడా టాటా సన్స్ చర్చలు జరిపినట్టు సమాచారం.