5 May, 2026 | 7:09 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

మామిడిపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

09-03-2026 02:53 AM

కోనరావుపేట మార్చి 08 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు తక్కల్ల భారతదామోదర్ రెడ్డి దంపతుల కొత్త ఇంటికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గృహప్రవేశం చేయించి ఆశీర్వదించారు.

అనంతరం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మామిడిపల్లి సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి,నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, డైరెక్టర్లు నాయిని ప్రభాకర్, సాసాల మల్లారెడ్డి, మామిడిపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జూకంటి మల్లేశం,ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.