కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయాలనేది లక్యం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల, మార్చి 8 (విజయ క్రాంతి): రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరుల చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయాలనేది ముఖ్యమంత్రి లక్యం.. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాం పల్లి గ్రామంలో మణిదీప, వినాయక గ్రామ పరస్పర సహాయక పొదుపు మరియు పరపతి సహకార సంఘం నూతన భవనాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యంపై తొలి సంతకం చేసి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని అన్నారు.
ఇందులో భాగంగా మహిళా సంఘాలకి ఆర్టీసీ బస్సులు నడిపించుకునే అవకాశం కల్పించడంతోపాటు పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేస్తున్నారని మంత్రి తెలిపారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు సంఘటితంగా ఆర్థిక అభివృద్ధి సాధించాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి లత, గ్రామ సర్పంచి సంగ రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోపిక పాల్గొన్నారు. తప్పక అభివృద్ధి చేస్తామని కార్పొరేటర్లు హామీ ఇచ్చారు




