7 March, 2026 | 8:30 PM

చీర్లవంచలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

06-03-2026 07:17 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జె టోనీ మాట్లాడుతూ పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లు నిలుస్తున్నాయని తెలిపారు. గూడు లేని నిరుపేదలకు స్వంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.

ఏఎంసీ వైస్ చైర్మన్ నర్సింగం గౌడ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. నిరుపేదల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేణుక రాజు, ఎంపీడీఓ లక్ష్మినారాయణ, హౌసింగ్ ఏఈ హమీద్, ప్యాక్స్ డైరెక్టర్ కొండయ్య, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు జలంధర్ రెడ్డి, సుద్దాల శ్రీనివాస్, నలువల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.