7 March, 2026 | 6:37 PM

మనస్థాపంతో ఉరివేసుకొని వ్యక్తి మృతి

06-03-2026 07:14 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామానికి చెందిన ధ్యావల్ల రాములు 26 అనే వ్యక్తి మనస్థాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ సీఐ శ్రీధర్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాములు బాగా త్రాగి తన భార్యతో గొడవపడి ఆమెను కొట్టాగ మరుసటి రోజు కూడా మళ్లీ తాగిన మైకంలో ఆమెతో గొడవపడి ఆమెను కొట్టడంతో తన పుట్టింటికి వెళ్ళిపోయిందనీ సీఐ తెలిపారు.

ఇట్టి విషయంలో మానస్థాపం చెందిన రాములు త్రాగిన మైకంలో తనకు తానుగా ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదుల పేర్కొన్నట్లు సిఐ తెలిపారు. తండ్రిసాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు.