16 April, 2026 | 11:23 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఇందిరమ్మ ఇండ్లపై గుబులు..!

18-06-2025 12:00 AM
  1. పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యం అంటూ ప్రచారం
  2. లబ్ధిదారుల ఎంపికలో చేతివాటం..?
  3. కాంగ్రెస్ లీడర్ల మాటలతో అర్హుల్లో ఆందోళన

నల్లగొండ టౌన్, జూన్ 17 : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడా నికి ఇందిరమ్మ గృహ పథకం కీలక భూమి ని పోషించిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది నర లోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఏడాదికి 4.5 లక్షల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. దానిలోభాగంగానే ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3500 ల ఇండ్లను మంజూరు చేశారు.

నల్లగొండ జిల్లాలో ఇప్పటికే మొదటి విడతలో 1,753 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా రెండవ విడతలో 10,311 ఇండ్లు మంజూరయ్యాయి. ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు విడతల వారి గా ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ ను కూడా తీసుకువచ్చింది.

ఇదంతా బాగానే ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎంపిక విధా నంపై నిరుపేదల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు మాకు ఇల్లు వస్తుందా, మమ్మ ల్ని లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారా? కాంగ్రె స్ పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యతనిస్తారా? అనే రకరకాల ప్రశ్నలు సామాన్య ప్రజల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

కార్యకర్తలకే అంటూ ప్రచారం...

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయటం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్‌ని తీసుకువచ్చింది. సర్వేయర్‌లు ఇంటి టికి తిరిగి దరఖాస్తు దారుల వివరాలను నమోదు చేస్తున్నారు. సొంత ఇల్లు లేని వారిని ఈ పథకానికి ఎంపిక చేస్తామని, లబ్దిదారుల ఎంపిక పారదర్శకం గా ఉంటుందని అటు ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పదే పదే చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ప్రచా రం మరో రకంగా జరుగుతుంది.

మొదటగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన తర్వాతే మిగిలిన వారికి ఇందిరమ్మ గృహాలు వస్తాయని చోటమోటా లీడర్లు ప్రచారం చేస్తున్నా రు. కొన్ని గ్రామాల్లోనైతే పార్టీ అధికారంలోకి రావడం కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ఇచ్చిన తర్వాతే వేరే వారిని ఎంపికచేయాలని అంతర్గతంగా పార్టీ కార్యకర్తలు తీర్మానాలు కూడా చేసుకుంటున్నట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు సైతం పార్టీ అంతర్గత సమావేశాల్లో కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని బాహాటంగానే చెబుతున్నారు.

లబ్ధిదారుల ఎంపికలో చేతివాటం..?

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే  ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ళను, రేషన్ కార్డుల తో పాటు సంక్షేమ పథకాలు ప్రారంభించింది. ఇం దులో భాగంగా జిల్లాలోని పలు మండల, గ్రామాలలో కొందరు అధికార పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను లక్ష రూ పాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. డబ్బులు ఇవ్వకుంటే ఇందిరమ్మ ఇల్లు రాదని లబ్ధిదారుల ను అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నట్లు వినికిడి.