18-06-2025 12:00:00 AM
మహబూబాబాద్, జూన్ 17 (విజయ క్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు ల ధాన్యాన్ని శుభ్రం చేయడానికి మార్కెట్ కమిటీలు కొనుగోలు కేంద్రాలకు ఇచ్చిన ప్యాడి క్లీనర్లను గాలికి వదిలేశారు. మహబూబాబాద్ జిల్లాలో కేసముద్రం, మహబూబా బాద్ మార్కెట్ పరిధిలోని ధాన్యం కొనుగో లు కేంద్రాలకు ప్యాడీ క్లీనర్లు, లిఫ్టర్లు కలిపి 100కు పైగా అందజేశారు.
వ్యవసాయ మా ర్కెటింగ్ శాఖ ద్వారా మార్కెట్లలో ధాన్యం శు భ్రం చేయడానికి ఏర్పాటుచేసిన ప్యాడీ క్లీనర్లను గత యాసంగి సీజన్ లో ధాన్యం కొను గోలు కేంద్రాలకు ఇచ్చారు. కొనుగోలు కేం ద్రాల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేసి దాదా పు పక్షం రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలకు ఇచ్చిన ప్యాడీ క్లీనర్లను నిర్వాహకులు తిరిగి వ్యవసాయ మార్కెట్ కు ఇవ్వ కుండా చాలా చోట్ల అక్కడే వదిలేశారు.
ఫలితంగా వర్షాలకు అవి తడిచిపోయి తుప్పు పడుతున్నాయి. ప్యాడి క్లీనర్ మోటార్లు దెబ్బతింటున్నాయి. వందకు పైగా కొనుగోలు కేంద్రాలకు ప్యాడి క్లీనర్ లను ఇవ్వగా అం దులో సగానికి పైగా ప్యాడి క్లీనర్లు తిరిగి మా ర్కెట్లకు అప్పగించలేదని సమాచారం. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ప్యాడీ క్లీనర్లను తీసుకుపోయే సమయంలో చూపించే శ్రద్ధ, తిరిగి ఇచ్చే సమయంలో చూపడం లేదనే వి మర్శలు వస్తున్నాయి.
ఫలితంగా వేల రూపాయలు వెచ్చించి మార్కెటింగ్ శాఖ సమకూ ర్చిన ప్యాడి క్లీనర్లు కొనుగోలు కేంద్రాల్లోనే వదిలేయడం వల్ల వాటి పరికరాలు దెబ్బ తినడం, చౌర్యానికి గురి కావడం జరుగుతున్నాయి. సక్రమంగా ప్యాడీ క్లీనర్లను తిరిగి ఇ వ్వకపోవడంతో వాటి మరమ్మత్తులు, పరికరాలకు మార్కెటింగ్ శాఖ మళ్లీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ప్రతి సీజన్లో వినియోగించే పరిస్థితిలో ఉన్న ప్యాడి క్లీనర్లను తీసుకువెళ్లి పనికిరాకుండా చేసి అ ప్పగించడం వల్ల మార్కెటింగ్ శాఖకు వాటి నిర్వహణ భారంగా మారింది. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాల నిర్వహకులు మార్కెట్ల నుంచి తీసుకువెళ్లిన ప్యాడి క్లీనర్ లను తిరిగి అప్పగించాల్సిన అవసరం ఉంది.
అప్పగించాలని అడుగుతూనే ఉన్నాం
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్కెటింగ్ శాఖ తరపున అందజేసిన ప్యాడి క్లీనర్లను తిరిగి అప్పగించాలని అడుగుతూనే ఉన్నాం. 25 ప్యాడి క్లీన ర్లు తిరిగి ఇచ్చారు. మరో 30 కి పైగా ప్యాడి క్లీనర్లు కేసముద్రం మార్కెట్కు తిరిగి ఇవ్వా ల్సి ఉంది. నిర్వాహకులను ప్యాడి క్లీనర్లు తిరిగి తెచ్చే విధంగా తరచుగా కోరుతున్నాం. త్వరలోనే మిగిలిన ప్యాడి క్లీనర్లను మార్కెట్ కు తెచ్చి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం.
అమరలింగేశ్వరరావు, మార్కెట్ కార్యదర్శి, కేసముద్రం