25 June, 2026 | 1:15 AM

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

25-06-2026 12:00 AM
  1. అత్యధికంగా అనాజ్‌పూర్‌కు మంజూరు
  2. 50 లక్షల రోడ్డు పనులకు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపన

ఇబ్రహీంపట్నం, జూన్ 24 (విజయక్రాంతి) : అనాజ్‌పూర్ గ్రామానికి నియోజక వర్గంలోనే అత్యధిక ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, ఇంకా ఎవరికైనా ఇల్లు లేకుంటే దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం అనాజ్‌పూర్ గ్రామంలో రూ.50 లక్షల హెచ్‌ఎండీఎ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామస్తులు మురుగునీటి కాలువ సమస్య లేవనెత్తగా, ఎంపీడీవోని పిలిపించి వివరణ కోరారు. త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇ చ్చారు. గ్రామం అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రం గారెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ న్ చిలుక మధుసూదన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రాచపాక నవనీత మహేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, గ్రామ పం చాయతీ సభ్యులు కావలి వెంకటేష్, గువ్వల భరత్, ఏర్పుల సంధ్య బాలరాజ్, గుజ్జ రాం రెడ్డి, ఇంజమూరి కవిత మహేందర్, చిలుక యాదిరెడ్డి, ఏర్కలి బాలకృష్ణ గౌడ్, ఎల్కపల్లి సింధు మహేష్, రాగని అరవింద్‌తో పాటు పంచాయతీ రాజ్ ఏఈ ఇంద్రసేనా రెడ్డి, ఎంపీడీఓ స్రవంతి, ఏఇ సూర్యతేజ, గ్రామ కార్యదర్శి సూరిబాబు, అనాజ్‌పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.