25 June, 2026 | 2:06 AM

ములకలపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

25-06-2026 01:11 AM

ములకలపల్లి, జూన్ 24 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ బుధవారం ములకలపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించి తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ను సందర్శించారు.ముందుగా పోలీస్ గౌరవ వందనo స్వీకరించి స్టేషన్ పరిసర ప్రాంతాలను నిశితంగా  గమనించి తగు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరితోటి మాట్లాడి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుని సావిదానంగా విని తగు సలహాలు సూచనలు చేశారు.

పోలీస్ స్టేషన్ లో  కంప్యూటర్ రూమ్,లాక్ అప్ గదులను పరిశీలించి వీటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారుల తోటి మంచిగా నడుచుకోవాలని వారి సమస్యలను ఓపికతో విని ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అదే విధంగా పెండింగ్లో ఉన్న కేసులను పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన  న్యాయం చేయాలని సూచించారు. రికార్డులను పరిశీలించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించారు.ఈ తనిఖీలో పాల్వంచ ఎస్ డి పి ఓ సతీష్ కుమార్, పాల్వంచ సీఐ సతీష్,మూలకలపల్లి ఎస్. ఐ మధు ప్రసాద్  పాల్గొన్నారు.