గద్వాల్ వీవర్స్ కొత్త షో రూం
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడి సమీపంలో ప్రారంభం
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడి సమీపంలో గద్వాల్ వీవర్స్ సొసైటీ నూతన శారీ షోరూంను యాంకర్ సుమా కనకాల, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి నవీన్ యా దవ్, సంస్థ ప్రతినిధులు రాంగోపాల్ అగర్వాల్, ఆకాష్ అగర్వాల్ కలిసి ప్రారంభించా రు. నేత కార్మికుల జీవనోపాధిని బలోపేతం చేయడమే లక్ష్యంగా 1986లో శ్రీ రామ్ గో పాల్ ఈ సొసైటీని స్థాపించారు. సాంప్రదాయ కాటన్ చీరలతో పాటు వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా సిల్క్-కాటన్, స్వచ్ఛమైన పట్టు గద్వాల్ చీరలను ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు.
బాడీ, బోర్డర్లను వేర్వేరుగా నేసి సంప్రదాయ ఇంటర్లాకింగ్ ప ద్ధతిలో కలపడం, జరీ డిజైన్లు ఈ చీరల ప్ర త్యేకత. నేరుగా నేత కార్మికుల ధరలకే నాణ్యమైన ఉత్పత్తులను కస్టమర్లకు అందిస్తున్నట్లు రాంగోపాల్, ఆకాష్ తెలిపారు. గద్వాల్‌తో పాటు కాంచీపురం పట్టు, పైఠాణీ, నారాయణపేట, పోచంపల్లి ఇకత్, ఉప్పాడ, జమ్దాని, బనారసీ వంటి ప్రముఖ చేనేత రకాలు కూడా ఇక్కడ లభిస్తాయి.






