ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి
12-06-2026 01:23 PM
ఎంపీడీవో రాధా రాథోడ్
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభానికి సిద్ధం చేయాలని ఖానాపూర్ ఎంపీడీవో రాధా రాథోడ్ ఆదేశించారు. శుక్రవారం ఖానాపూర్ మండలంలోని గోసంపల్లి, ఎల్లాపూర్, సేవియా నాయక్ తండ, గ్రామాల్లో ఆమె పర్యవేక్షించారు. ఇదివరకే నిర్మించిన వాటికి పూర్తిస్థాయి రంగులు వేసి ప్రవేశానికి సిద్ధం చేయాలని అన్నారు .గ్రామాల్లో నర్సరీలు పరిశీలించి మొక్కలు నాటే కార్యక్రమానికి సిద్ధం కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు ఖానాపూర్ ఎం పి ఓ సి హెచ్ రత్నాకర్ రావు పలువురు ఉన్నారు.






