12 June, 2026 | 2:04 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

12-06-2026 01:25 PM

ఖానాపూర్, (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం దిలావర్పూర్ గ్రామంలో శుక్రవారం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జంగిలి శంకర్ చేతుల మీదుగా ఈ చెక్కులను అందజేశారు. గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ నయీమ్ రూ. 29,500, మీర్జా వాజిద్ బేగ్ కు రూ. 60000 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా జంగిలి శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రజా ప్రభుత్వమని అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారని  అందుకోసం నిరంతరం పాటు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతల మల్లేష్ ,ఉప సర్పంచ్ ఓరగంటి రాజేశ్వర్ ,నవీన్, లక్ష్మీపతి గౌడ్,  శేఖర్, రాజన్న, నాగరాజు, గంగాధర్, తదితరులు ఉన్నారు.