25-05-2025 12:00:00 AM
-మేడ్చల్ కలెక్టర్‌కు ఎల్బీనగర్ ఎమ్మెల్యే వినతి
ఎల్బీనగర్, మే 24 : నాగోల్ డివిజన్ సాయి నగర్ గుడిసెవాసులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. సాయి నగర్ అగ్ని ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని శనివారం మేడ్చల్ కలెక్టర్ గౌతమ్‌ను మర్యాదపూర్వకంగా కలిశా రు.
ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... కొన్ని రోజుల క్రితం నాగోల్ డివిజ న్ పరిధిలోని సాయి నగర్ లో పేదలకు చెందిన గుడిసెలు కాలిపోయాయని తెలిపారు. దాదాపు 650 మంది నిరాశ్రయులయ్యారని, గుడిసెలు వేసుకొని పట్టా స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేయాలని కలెక్టర్ ను కోరారు.
కలెక్టర్ స్పందిస్తూ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవాలి అంటే దాదాపు 400 స్క్వేర్ ఫీట్లు ఉండాలన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం అక్కడ కొందరికి 30 నుంచి 40 గజాలు ఉన్న నేపథ్యంలో తక్కువ స్థలం ఉన్నవారికి జీ ప్లస్ వన్ నిర్మాణనికి అవకాశం కల్పించాలని కోరారు.
ఈ విషయంపై హోసింగ్ బోర్డు ఎండీతో మాట్లాడి సాధ్యాసాధ్యాలు పరిశీలించి, పేదలకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు స్పందిస్తూ గత అనేక సంవత్సరాలు నుంచి పేదవారు అక్కడ నివాసం ఉంటున్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కె.చందు, ఫైమిద, నాయకులు పాషా, సాహెద బేగం, యాదయ్య, శ్రీనివాస్, రాములు తదితరులు పాల్గొన్నారు.