25-05-2025 12:00:00 AM
-ఉద్యమకారులు హాజరై విజయవంతం చేయాలి
-టీయూ జేఏసీ సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రపూల్ రాంరెడ్డి
ముషీరాబాద్, మే 24 (విజయ క్రాంతి) : తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 27న ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీయూ జేఏసీ) ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీయూ జేఏసీ సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రపూల్ రాంరెడ్డి తెలిపారు.
ఈ మేరకు శనివారం గాంధీనగర్ సబర్మతి నగర్ లో బస్తీ వాసులతో కలిసి గోడ పత్రికను జేఏసీ చైర్మెన్ సొంతం యాదగిరి, కోశాధికారి కలప చంద్రశేఖర్ ప్రసాద్ లతో కలసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, ఉద్యోగస్తులు, మేధావులు, కవులు, కళాకారులు సబ్బండవర్గాలు పెద్ద ఎత్తున హాజరై ఈ ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకాల వేదిక అధ్యక్షులు యాదగిరి, టీజేఎస్ నాయకులు మెరుగు శ్రీనివాస్ యాదవ్, మల్లేష్, సాయి బస్తీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.