24-05-2025 11:17:22 PM
నిరుపేదలకు సీఎం రిలీఫ్ ద్వారా బరసనిస్తున్న ప్రభుత్వం..
76 మంది లబ్ధిదారులకు 31 లక్ష 71000 500 రూపాయలు చెక్కుల అందజేత..
జర్నలిస్టు తోహిద్ మరణం తీరనిలోటు..
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఆరోగ్యం బాగుంటేనే జీవితంలో ఏదైనా సాధించగలమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) స్పష్టం చేశారు. శనివారం నియోజకవర్గంలోని 76 మంది వివిధ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందిన లబ్ధిదారులకు చెక్కులను, హన్వాడ మండలంలోని సలోనిపల్లి, పల్లె మోని కాలనీ, నాయినోని పల్లి, హన్వాడలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసి అనుమతు పత్రాలను లబ్ధిదారులకు, బుద్ధారం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యేగా పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం జిల్లా కేంద్రంలో వీడియో జర్నలిస్టు తోహీద్ మరణించడంతో ఆయన మృత దేహనికి పూలమాలవేసి నివాళులర్పించారు. జర్నలిస్టులకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. వీడియో జర్నలిస్టు తోహీద్ మరణం తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు జరిగిన వివిధ కార్యక్రమాలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం శాయశక్తుల కృషి చేస్తామని తెలిపారు. సరైన సమయంలో ప్రభుత్వం విడుతల వారీగా పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. పేదలు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందిన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారిని ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు.
బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో జరుగుతున్నాయని దైవ అనుగ్రహం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. నిర్లక్ష్యమనే మాటకు తావు లేకుండా ప్రజా సంక్షేమం కోసం ప్రతిక్షణం శ్రమిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, రామచంద్రయ్య, శ్రీనివాస్ యాదవ్, ఫయాజ్, అవేజ్, అజ్మత్ అలి, ఏర్పుల నాగరాజు, గోవింద్ యాదవ్, సంజీవ్ రెడ్డి, మోయీజ్, లీడర్ రఘు, ప్రసాద్ ముదిరాజ్, చర్ల శ్రీనివాసులు, ఖాజా, పీర్ మహ్మద్ సాదిక్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.