ఎర్రపహాడ్‌లో ఇందిరమ్మ గృహప్రవేశం
02-06-2026 12:18 AM
తాడ్వాయి, జూన్, 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇంటికి గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గృహప్రవేశం నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ... గతంలో ఎన్నడు లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇంటిని నిర్మించి ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లవ్వ,నాయకులు మోహన్ రెడ్డి, ముఖేష్, లక్ష్మణ చారి, రాజలింగం తదితరులు పాల్గొన్నారు






