మొయినాబాద్ ఎంపీడీవోగా హిమబిందు బాధ్యతల స్వీకారం
02-06-2026 12:17 AM
నూతన అధికారికి శుభాకాంక్షల వెల్లువ
మొయినాబాద్, జూన్ 1(విజయ క్రాం తి): మొయినాబాద్ మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా నూతనంగా నియమితులైన హిమబిందు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్థులు ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
మండల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల సంక్షేమం, ప్రభుత్వ సం క్షేమ పథకాల అమలులో ఎంపీడీవో కీలక పాత్ర పోషిస్తారని, హిమబిందు నాయకత్వంలో మొయినాబాద్ మండలం మరింత అభివృద్ధి చెందాలని పలువురు ఆకాంక్షించారు. నూతన బాధ్యతలు చేపట్టిన హి మబిందుకు మండల ప్రజలు, అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలియజేస్తూ ఆమె పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.






