ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితులకు చెక్కుల అందజేత
మేడ్చల్, జూన్ 1 (విజయ క్రాంతి): సికింద్రాబాదు నుండి శామీర్ పేట్ వరకు ఎలివే టెడ్ కారిడార్ నిర్మాణానికి భూమి ఇచ్చిన తూంకుంట రైతులకు కలెక్టర్ మను చౌదరి చెక్కులు అందజేశారు. 24 ఏకరాలకు గాను రెండవ విడత విడతగా 19726.5 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చిన రైతులకు అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ 157 కోట్ల రూపాయల చెక్కును అందజేసా రు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండవ దఫాగా ఈ చెక్కులు అందించడం జ రిగిందని, మిగిలిన వారికి తరువాత అందించడం జరుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. తమ భూమికి చదరపు గజం లక్ష రూపాయలుగా ధర నిర్ణయించడంలో కలెక్టర్ చోరవ తీసుకున్నారని రైతు లు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు. తమ భూమి చదరపు గజం లక్ష రూపాయలుగా ధర నిర్ణయించడంలో చొరవ తీసుకు న్న కలెక్టర్ ను, తమకు చెక్కులు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన ఎస్‌డిసిఎల్ మాలతిని శాలువాతో సన్మానించారు.






