calender_icon.png 27 December, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా కృషి

27-12-2025 04:34:33 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న పాత్రికేయులకు ఇంటి స్థలాలను కేటాయించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి మాజీ డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పాత్రికేయులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలను సందర్శించి సంఘీభావం తెలిపారు.

జిల్లా ఇన్చార్జి మంత్రి ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి ఎఫ్ఎసి చైర్మన్ ధర్మాజీ రాజేందర్ మాజీ జేఏసీ నాయకులు కొత్త శేఖర్ ఎస్ టి యు రాష్ట్ర కార్యదర్శి గజేందర్ జిల్లా అధ్యక్షులు భూమున యాదవ్ ఐఎంఏ వైద్యులు డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి మురళీధర్ టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ తదితరులు సంఘీభావం తెలిపారు