27-12-2025 04:37:53 PM
రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ముఖ ద్వారంగా భావించే సండే మార్కెట్ నుంచి బస్ రూట్ హిందూ స్మశానానికి వరకు సుందరీకరణ పనులలో భాగంగా సెంటర్ డివైడర్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ గ్రంథాలయం వద్ద సుమారు రూ.35 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ డివైడర్ పనులను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, రామచంద్రాపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, స్థానికులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, డివైడర్ నిర్మాణం పూర్తైన అనంతరం మధ్య భాగంలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసి, ఈ మార్గాన్ని డివిజన్‌కు ప్రత్యేక ఆకర్షణగా సుందరీకరణ రోడ్డుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.